Yadadri: ఏ నరసింహస్వామి విగ్రహానికైనా నాలుక బయటకొచ్చే ఉంటుంది: యాదాద్రి వివాదంపై అర్చకుల వివరణ

  • మూలవిరాట్ లో మార్పులు చేస్తున్నారన్నది అబద్ధం
  • ఇలాంటి వార్తలను ఖండిస్తున్నాం
  • శిల్ప శాస్త్ర ప్రకారం నరసింహస్వామికి నాలుక బయటే వుంటుంది

యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్ లో మార్పులు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆలయ అర్చకులు, అధికారులు వివరణ ఇచ్చారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, స్వామి వారికి కుంభాభిషేకం జరిగే సమయంలో ఇలాంటి వార్తలు రావడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ తరహా వార్తలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.

'స్వామి వారి మూలవిరాట్ లో నాలుక బయటకొచ్చే విధంగా శిల్పులు చెక్కారన్న వార్త అబద్ధం. ఎందుకంటే, ఒక్క యాదగిరి గుట్టలోనే కాదు శిల్ప శాస్త్రం ప్రకారం వుండే ప్రపంచంలో ఏ నారసింహుడి విగ్రహాన్ని చూసినా నాలుక బయటకొచ్చే ఉంటుంది' అన్నారు.

కొన్ని దశాబ్దాలుగా నారసింహస్వామి వారికి సింధూరం వేస్తున్నామని, ఈ క్రమంలో సుమారు పదిహేను అంగుళాల పైచిలుకు అది అతుక్కుపోయి వుందని, దాన్ని స్వయంగా తాము తొలగించామని చెప్పారు. స్వామి వారి మూలవిరాట్ ను తాము తప్ప ఎవరినీ ముట్టుకోనివ్వమని, ఎవరైతే అభిషేకం, అర్చన చేస్తారో వాళ్లే ముట్టుకుంటారని చెప్పారు.

Yadadri
Lakshmi Narasimha swamy
priest
  • Loading...

More Telugu News