CPI leader Rama Krishna: పవన్ పై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్!

  • ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వని బీజేపీని ఎందుకు పొగుడుతున్నారు?
  • ప్రాంతీయ పార్టీల నేతలు మోదీ, అమిత్ షాను చూసి భయపడుతున్నారు
  • ప్రాంతీయ పార్టీలు వెన్నెముక లేనివిగా వ్యవహరిస్తున్నాయి

బీజేపీకి వత్తాసు పలుకుతూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. పవన్ వైఖరిని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వని బీజేపీని ఎందుకు పొగుడుతున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ మంత్రి  అమిత్ షాను ఎందుకు పొగుడుతున్నారో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నేతలు మీకేమైనా చెప్పారా? అని నిలదీశారు. ప్రాంతీయ పార్టీల నేతలు మోదీ, అమిత్ షాను చూసి భయపడుతున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు వెన్నెముక లేని పార్టీలుగా వ్యవహరిస్తున్నాయన్నారు.

CPI leader Rama Krishna
criticism against Pawan Kalyan
  • Loading...

More Telugu News