West Bengal: పశ్చిమబెంగాల్లో జోరు పెంచుతున్న అసదుద్దీన్ ఒవైసీ

  • జనవరిలో కోల్ కతాలో ర్యాలీకి సిద్ధమైన పార్టీ నేతలు
  • 2021 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు..
  • పార్టీ బలోపేతానికి అక్బరుద్దీన్ జిల్లాల్లో పర్యటన

ఇటీవల బీహార్ అసెంబ్లీలో తన ఖాతా ప్రారంభించిన ఏఐఎంఐఎం, ఆ పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో కూడా తన ఉనికిని చాటడానికి సిద్ధమైంది. పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో 2021లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు ఆ రాష్ట్రంలో నగరపాలిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జనవరిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు బెంగాల్ మజ్లిస్ అధ్యక్షుడు జమీరుల్ హసన్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో పార్టీని బలోపేతం చేయడానికి అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర సీనియర్ నాయకులు అక్కడి జిల్లాల్లో పర్యటిస్తారని హసన్ చెప్పారు.  

West Bengal
AIMIM Rally in Kolkata
leader Asaduddin Ovaisy participation
  • Loading...

More Telugu News