Janasena: పవన్ కల్యాణ్ పై మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం తగదు: టీడీపీ నేత అచ్చెన్నాయుడు

  • ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి పవన్ తెస్తున్నారు
  • వాటిపై స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తారా?
  • చంద్రబాబుపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు

సీఎం జగన్ పైనా, ఆయన ప్రభుత్వ తీరుపైనా విమర్శలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు మూకుమ్మడిగా ప్రతి విమర్శల దాడి చేయడం తగదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి పవన్ కల్యాణ్ తెస్తున్నారని, వాటిపై స్పందించాల్సిన మంత్రులు ఈవిధంగా ప్రతి విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై నోటికొచ్చినట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ మంత్రులు నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

Janasena
Pawan Kalyan
Telugudesam
Atchanaidu
  • Loading...

More Telugu News