Vijay Devarakonda: 'ఫైటర్'ను భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్న పూరి

  • విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్'
  • భారీ బడ్జెట్ తో సెట్స్ పైకి 
  •  కథానాయికగా కైరా అద్వాని 

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తదుపరి సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పూరి జగన్నాథ్ ఖాయం చేశాడు. పూరి మార్కుతో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితం కానుంది.

ఈ చిత్రం కథావస్తువు అన్ని ప్రాంతాల .. భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేది కావడంతో, వివిధ భాషల్లో దీనిని విడుదల చేయాలనే ఆలోచనతో పూరి వున్నాడట. అందువలన నిర్మాణ భాగస్వామ్యం కోసం కోలీవుడ్ .. బాలీవుడ్ కి సంబంధించిన నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కైరా అద్వాని కథానాయికగా కనిపించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

Vijay Devarakonda
Kiara adwani
  • Loading...

More Telugu News