Salman Khan: సల్మాన్ ఖాన్ పిలిచి అవకాశాలిచ్చినా చేయలేకపోయాను: ఇలియానా

  • 'వాంటెడ్' సినిమా సమయంలో ఎగ్జామ్స్ రాస్తున్నా
  • 'కిక్' సమయంలో మరో సినిమాకు కమిట్ మెంట్ ఉంది
  • అందుకే రెండు సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది

గోవా బ్యూటీ ఇలియానా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. గతంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పిలిచి మరీ అవకాశాలు ఇచ్చినా, తాను కాదన్నానని ఆమె తెలిపింది. సల్మాన్ 'వాంటెడ్' సినిమా సమయంలో తాను ఎగ్జామ్స్ రాస్తున్నానని చెప్పింది. సల్మాన్ మరో సినిమా 'కిక్' సమయంలో మరో సినిమాకు కమిట్ మెంట్ ఉండటంతో ఆ చిత్రాన్ని చేయలేకపోయానని తెలిపింది. ఈ కారణంగానే రెండు సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... 'వాంటెడ్' సినిమా 'పోకిరి' రీమేక్ కాగా... 'కిక్' సినిమా తెలుగు 'కిక్'కు రీమేక్. ఈ రెండు తెలుగు చిత్రాల్లో కూడా ఇలియానానే నటించడం కొసమెరుపు. హిందీలో ఈ చిత్రాల్లో సల్మాన్ సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ చేయలేకపోయానని ఇల్లీ అలా వాపోయింది.

Salman Khan
Iliana
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News