Trupti Desai: దిశ ఘటనపై ఆందోళన.. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద తృప్తి దేశాయ్ అరెస్టు.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు

  • వివాహ వేడుకలకు హాజరు కావడానికి సీఎంకి సమయం ఉంటుంది
  • దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాత్రం ఉండదు
  • కేసీఆర్ సమాధానం చెప్పాలి

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ యువతి 'దిశ' ఘటనపై భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆమె హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయానికి వెళ్లి, తన మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమెతో పాటు ఆమె అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 'వివాహ వేడుకలకు హాజరు కావడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమయం ఉంటుంది. కానీ, దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాత్రం ఉండదు. మేము త్వరలోనే సీఎం కార్యాలయానికి వెళ్లి, ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం' అని తృప్తి దేశాయ్ తెలిపారు.

Trupti Desai
Bhumata Brigade
Hyderabad
KCR
  • Loading...

More Telugu News