Eshwar: సొంత కుమార్తెను కూడా వదలని దుర్మార్గుడు... తమిళ టీవీ నటుడు ఈశ్వర్ పై భార్య జయశ్రీ ఫిర్యాదు!

  • భర్త ఈశ్వర్ పై కేసు పెట్టిన జయశ్రీ
  • ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు
  • చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న జయశ్రీ

తన ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి, అప్పు తీసుకుని, వాటిని వెనక్కు తెమ్మంటే తేవడం లేదని తమిళ టీవీ నటుడు ఈశ్వర్ పై పోలీసు కేసు పెట్టిన ఆయన భార్య జయశ్రీ, తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. భర్తపై మరో ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆమె, ఈశ్వర్ ను అరెస్ట్ చేసిన తరువాత, తనను చంపేస్తానంటూ బెదిరింపులు వస్తున్నాయని అన్నారు.

 మరో నటితో ఈశ్వర్ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడని ఆరోపించారు.  తాగుడుకు, జూదానికి, గంజాయికి అలవాటు పడిన తన భర్త, కన్న కూతురిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డ దుర్మార్గుడని అన్నారు. అతని ఆగడాలను సహించలేక పోతున్నానని, అందుకే ఫిర్యాదు చేసేందుకు వచ్చానని అడయార్ పోలీసు స్టేషన్ కు వచ్చిన జయశ్రీ వ్యాఖ్యానించారు. తనను హత్య చేస్తానని బెదిరిస్తున్న వారు ఎవరో కనిపెట్టాలని ఆమె అభ్యర్థించారు.

Eshwar
Jayasri
Harrasment
Daughter
Chennai
  • Loading...

More Telugu News