Prakasam District: చదివించేందుకు తండ్రి పడుతున్న కష్టం చూడలేక... తనువు చాలించిన కుమార్తె!

  • ప్రకాశం జిల్లా చీరాలలో ఘటన
  • సౌదీలో పనిచేస్తూ కుమార్తెను చదివించిన రాంబాబు
  • డబ్బుకు ఇబ్బందులు పడుతున్నాడని ఆత్మహత్య

తన ఉన్నత చదువులతో తండ్రికి భారం అవుతున్నానని భావించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, సౌదీలో పనిచేస్తూ, తన ముగ్గురు పిల్లలనూ చదివించుకుంటున్న వేల్పూరి రాంబాబు, మూడో కుమార్తె వైష్ణవి (22). ఆమె ఇటీవల ఎమ్మెస్సీ పూర్తి చేసి, సివిల్స్ రాస్తానని తండ్రికి చెప్పింది.

 తాను డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా, కుమార్తె కోరికను కాదనలేకపోయిన రాంబాబు, హైదరాబాద్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో మాట్లాడాడు కూడా. అయితే, ట్యూషన్ ఫీజు కట్టేందుకు అతని వద్ద డబ్బులు లేవు. డబ్బుల కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసిన వైష్ణవి, నిన్న ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుంది. కుమార్తె మరణాన్ని చూసి రాంబాబు బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Prakasam District
Chirala
Vaishnavi
Sucide
  • Loading...

More Telugu News