Nityananda: నిత్యానంద 'కైలాస' దేశం విశేషాలివి!

  • ఇటీవల దేశం విడిచి పారిపోయిన నిత్యానంద
  • ఓ దీవిని కొనుగోలు చేసి, అందులోనే మకాం
  • ప్రత్యేక పాస్ పోర్టు, జెండా ఏర్పాటు

ఇండియా నుంచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద, ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసుకుని దానికి 'కైలాస' అనే పేరు పెట్టారన్న సంగతి తెలిసిందే ఈ దీవిని ఓ ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరుతున్న ఆయన, ఓ పాస్‌ పోర్ట్‌ ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని కూడా తయారు చేసుకున్నారు.

అంతే కాదు, ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ ను ఏర్పాటు చేశారు. రోజూ మంత్రివర్గ సమావేశాలు కూడా జరుపుతున్నారు. తన దేశానికి ప్రధానిగా 'మా'ను నియమించామని, బంగారం, ఎరుపు రంగుల్లో పాస్ పోస్ట్ ఉంటుందని 'కైలాస' వెబ్ సైట్ పేర్కొంది.

మెరూన్ కలర్ లో కనిపిస్తున్న సింహాసనంపై నిత్యానంద కూర్చుని ఉండగా, పక్కన నంది బొమ్మతో జెండాను రూపొందించారు. 'కైలాస'లో పది మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. నిత్యానంద కార్యాలయంతో పాటు విదేశీ వ్యవహారాలు, హోమ్, సోషల్ మీడియా, రక్షణ, విద్య, వాణిజ్యం తదితర శాఖలు ఏర్పాటయ్యాయి.

ఇక తాను ఇండియాలో హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్నందున తన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అంటున్న నిత్యానంద, తన దేశానికి సరిహద్దులు ఉండవని, ప్రపంచంలోని ఏ దేశపు వారైనా రావచ్చని, పౌరసత్వం కావాలంటే విరాళాలు ఇవ్వాలని అంటున్నారు. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నామని నిత్యానంద వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News