Andhra Pradesh: పవన్ ‘అజ్ఞాతవాసి’ నుంచి ‘అయోమయవాసి’ అయ్యాడు!: మంత్రి అవంతి ఎద్దేవా

  • పవన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో చేసినవి
  • దిశ పడిన నరకయాతనకు రెండింతలు ఎక్కువ బాధపడేలా శిక్ష వేయాలి
  •  జగన్ ను విమర్శించే కొద్దీ మరింత దిగజారిపోతారని చురక

రేపిస్టులకు నాలుగు బెత్తం దెబ్బలు సరిపోతాయన్నజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యాన్ని తెలుపుతున్నాయన్నారు. దిశ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. దిశ పడిన నరకయాతనకు రెండింతలు ఎక్కువ బాధ పడేలా నిందితులకు శిక్షలు వేయాలని అవంతి అన్నారు.

జగన్ ను విమర్శించిన కొద్దీ మరింత దిగజారిపోతారన్న విషయాన్ని పవన్ గుర్తెరగాలని మంత్రి పేర్కొన్నారు. మొన్నటివరకు టీడీపీకి, ఇప్పుడు బీజేపీకి కాల్ షీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కావాలంటే జనసేనను బీజేపీలో కలిపేయండి అని పవన్ కు సూచించారు. పవన్ ‘అజ్ఞాతవాసి’ నుంచి ‘అయోమయవాసి’ అయ్యాడని విమర్శించారు.

Andhra Pradesh
Minister Avanti Srinivas criticism against Pawan kalyan
  • Loading...

More Telugu News