Volunteer: గ్రామ, వార్డు వలంటీర్ల కోసం స్మార్ట్ ఫోన్ల కొనుగోలు... రివర్స్ టెండరింగ్ తో ఆదా!

  • వలంటీర్ల కోసం 2,64,920 ఫోన్లు కొనుగోలు
  • రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు
  • రూ.83.8 కోట్లు ఆదా!

ఏపీలో గ్రామ, వార్డు వలంటీర్ల కోసం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసింది. వలంటీర్ల కోసం మొత్తం 2,64,920 ఫోన్లను కొనుగోలు చేశారు. ఏపీటీఎస్ ద్వారా మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ నిర్వహించారు. ఇందుకోసం రివర్స్ టెండరింగ్ చేపట్టగా, రూ.83.8 కోట్లు ఆదా అయినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నవంబరు 30న తొలి దశ బిడ్డింగ్ తెరిచిన ఏపీటీఎస్ రూ.317.61 కోట్లు కోట్ చేసి ఓ కంపెనీ ఎల్-1గా నిలిచింది. దీనిపై రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ.233.81 కోట్లకు కోట్ చేసి ఆ కంపెనీ బిడ్ దక్కించుకుంది. దాంతో భారీగా ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News