Pawan Kalyan: అందుకే, పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

  • జగన్ ని సీఎంగా పవన్ గుర్తించనంత మాత్రాన నష్టమేమీ లేదు
  • ‘జనసేన’ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు
  • జగన్ పై టీడీపీ, జనసేన లు కత్తిగట్టాయి

జగన్ ని సీఎంగా పవన్ కల్యాణ్ గుర్తించనంత మాత్రాన ఆకాశమేమీ విరిగిపడదని, భూమి బద్దలు కాదని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమిని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆ బాధలో నుంచి బయట పడటం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై మొదటి నుంచి టీడీపీ, జనసేన లు కత్తిగట్టి పని చేసినప్పటికీ జగన్ ని వీసమెత్తు కూడా కదిలించలేకపోయారని అన్నారు. జగన్ ఆరు నెలల పాలనలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

Pawan Kalyan
Chandrababu
Nandigam suresh
mp
  • Loading...

More Telugu News