Pawan Kalyan: టీడీపీ, బీజేపీలకు ఉమ్మడి ప్రేమికుడు పవన్ కల్యాణ్: వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి

  • జగన్ పైనా, వైసీపీ నేతలపై పవన్ విమర్శలు
  • స్పందించిన వైసీపీ నేతలు
  • పవన్ మతిస్థిమితం కోల్పోయినట్టుందన్న అమర్ నాథ్ రెడ్డి

జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా వైసీసీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తాజా వ్యాఖ్యలతో జనసేన వైఖరేంటో వెల్లడైందని, టీడీపీ, బీజేపీ, జనసేన ఒకటేనని తాము గతంలోనే చెప్పామని అన్నారు. టీడీపీ, బీజేపీలకు పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రేమికుడని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని, ఏ రోజు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. పవన్ మతిస్థిమితం కోల్పోయాడేమోనని అనుమానంగా ఉందని అమర్ నాథ్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు.

Pawan Kalyan
Amarnath Reddy
Telugudesam
YSRCP
BJP
Jana Sena
Andhra Pradesh
  • Loading...

More Telugu News