Janasena: పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత ఇక్బాల్

  • మహిళలను గౌరవించని వాడు పవన్
  • ఇటువంటి వ్యక్తి పార్టీ నడపడానికి అర్హుడా?
  • ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడా?

మహిళలను గౌరవించని వాడు, విలువ లేని వాడు, సంస్కృతిని గౌరవించనివాడు.. ఇటువంటి వ్యక్తి పార్టీ నడపడానికి అర్హుడా? ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడా? అంటూ ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ఇక్బాల్ విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి వారిపై ఎలక్షన్ కమిషన్, న్యాయస్థానాలు సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకున్న పవన్, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళలను గౌరవించని వాళ్లు ఏ విధంగా తమకు ఓట్లు వేయమని వారిని అడుగుతారు? అని ప్రశ్నించారు.  

Janasena
Pawan Kalyan
YSRCP
Iqbal
mlc
  • Loading...

More Telugu News