Tammareddy Bharadwaja: చిరంజీవిగారు ఒక స్టేట్ మెంట్ ఇస్తే చిత్రపరిశ్రమ అంతా ఇచ్చినట్టే: దిశ ఘటనపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు

  • సంచలనం సృష్టించిన దిశ ఘటన
  • స్పందించిన తమ్మారెడ్డి
  • ఎలాంటి దేశంలో ఉన్నామా అనిపిస్తోందని వ్యాఖ్యలు

నిర్భయ ఘటన తర్వాత యావత్ భారతాన్ని కుదిపేసిన ఘటన దిశ ఉదంతం. దీనిపై టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిత్ర పరిశ్రమలో కూడా దిశ ఘటనపై ఎంతో బాధపడుతున్నారని, అయితే అందరూ బాహాటంగా స్పందించలేమని అన్నారు. ఇప్పటికే చిరంజీవి గారు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారని, అంతటి వ్యక్తి స్పందించి ఓ స్టేట్ మెంట్ ఇచ్చారంటే చిత్రపరిశ్రమ అంతా ఇచ్చినట్టేనని అభిప్రాయపడ్డారు.

నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా న్యాయం జరగని పరిస్థితి ఉందని, ఎలాంటి దేశంలో ఉన్నామా అనిపిస్తోందని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏమన్నా అంటే దేశభక్తి లేదంటూ అపవాదు భరించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ మాట్లాడారని, కానీ సినిమా వాళ్లు మాట్లాడినంత మాత్రాన ఏం జరుగుతుంది? అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు.

Tammareddy Bharadwaja
Tollywood
Chiranjeevi
Disha
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News