Chandrababu: వికలాంగులకు విభిన్న ప్రతిభావంతులని మా ప్రభుత్వంలోనే నామకరణం చేశాం: చంద్రబాబు

  • నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
  • దివ్యాంగులకు చంద్రబాబు శుభాకాంక్షలు
  • టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన ఆయన, తమను వికలాంగులు అని అందరూ పిలుస్తుంటే వారిలో ఆత్మన్యూనత భావం కలుగుతుందని భావించి, అప్పట్లో తమ ప్రభుత్వ హయాంలో వారికి 'విభిన్న ప్రతిభావంతులు' అని నామకరణం చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. అందరితో సమానంగా దివ్యాంగులు కూడా లక్ష్యాలను అందుకోవచ్చని, కలలను సాకారం చేసుకోవచ్చని తెలిపారు. అందుకోసం టీడీపీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Chandrababu
Andhra Pradesh
Telugudesam
Handicaped
  • Loading...

More Telugu News