Pawan Kalyan: ఇలాంటి వాళ్లు అమిత్ షా వంటి నాయకులకే భయపడతారు: పవన్ కల్యాణ్

  • రాయలసీమలో పవన్ టూర్
  • తిరుపతిలో న్యాయవాదులతో సమావేశం
  • ఇప్పటి రాజకీయాలకు అమిత్ షానే సరైన వ్యక్తి అని వ్యాఖ్యలు

తిరుపతిలో న్యాయవాదులతో సమావేశమైన జనసేనాని పవన్ కల్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. త్రికరణశుద్ధి ఉన్న న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రాయలసీమను కొన్ని ముఠాలు కబ్జా చేశాయని ఆరోపించారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటివారికే ఇలాంటి వాళ్లు భయపడతారని వ్యాఖ్యానించారు. ఆయన ఉక్కుపాదంతో అణచివేస్తారన్న భయం వీళ్లకు ఉందని అన్నారు. ఇప్పటి రాజకీయాలకు అమిత్ షా వంటి నేతలే సరైనవాళ్లని అభిప్రాయపడ్డారు.

జనసేన పార్టీ గురించి చెబుతూ, సమస్యలపై సామాన్యుడి ఆవేదనే జనసేన అని అభివర్ణించారు. అయితే తన నుంచి, తన పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఆశించవద్దని స్పష్టం చేశారు. భావితరాల క్షేమం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Tirupati
Jana Sena
Lawyers
  • Loading...

More Telugu News