Allu Aravind: పవన్ సినిమాలో విలన్ వేషం కోసం మమ్ముట్టికి కాల్ చేస్తే అలా అన్నారు: అల్లు అరవింద్

  • పదేళ్ల క్రితం మమ్ముట్టికి కాల్ చేశాను 
  •  పవన్ సినిమాలో విలన్ వేషం ఉందని చెప్పాను 
  • సారీ చెప్పేసి ఫోన్ పెట్టేశానన్న అల్లు అరవింద్

మమ్ముట్టి తాజా చిత్రమైన 'మమాంగం' మలయాళంతో పాటు తెలుగులోను త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను ఇక్కడ అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పదేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను వేదికపై వున్న మమ్ముట్టికి ఇలా గుర్తు చేశారు.

"పదేళ్ల క్రితం ఒకసారి నేను మమ్ముట్టిగారికి కాల్ చేశాను. 'సార్ .. మా సినిమాలో ఒక మంచి పాత్ర వుంది .. మీరు చేయాలి' అన్నాను. 'ఏం కేరక్టర్ అది?' అని మమ్ముట్టిగారు అడిగారు. 'పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్నాడు .. అందులో చాలా మంచి కేరక్టర్ సార్ .. విలన్ కేరక్టర్' అని చెప్పాను నేను. 'అహా అట్లాగా .. ఈ పాత్రను చిరంజీవిని వేయమని నువ్వు అడగ్గలవా' అన్నారు. 'నేను అడగనండీ' అన్నాను. 'మరి నన్నెందుకు అడుగుతున్నావ్' అని అన్నారు. 'సారీ సార్ ..' అని ఫోన్ పెట్టేశాను' అని చెప్పుకొచ్చారు.

Allu Aravind
Mammootty
  • Loading...

More Telugu News