West Indies: వెస్టిండీస్ లోని సొంత దీవిలో ప్రత్యక్షమైన స్వామి నిత్యానంద!

  • వివాదాలకు మారుపేరులా నిత్యానంద
  • భారత్ లో అనేక ఆరోపణలు
  • దేశం విడిచి పారిపోయిన స్వామీజీ

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద తనపై ఉన్న కేసులకు భయపడి దేశం దాటిన సంగతి తెలిసిందే. నిత్యానంద ఏ దేశం వెళ్లి ఉంటాడంటూ విపరీతమైన చర్చ నడిచింది. తాజాగా, ఈ విలక్షణ స్వామి వెస్టిండీస్ దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలం క్రితమే అక్కడి దీవుల్లో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసిన స్వామీజీ దానికి కైలాసదీవి అని నామకరణం కూడా చేశారు.

అంతేకాదు, తన దీవికి దేశం హోదా ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశాడు. అంతటితో ఆగకుండా, తన దేశంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకంగా పాస్ పోర్టును కూడా రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిత్యానంద తన సొంత దీవిలోనే మకాం వేసినట్టు సమాచారం!

West Indies
Swami Nithyananda
India
Kailasa Island
  • Loading...

More Telugu News