Chandrababu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి సవాల్

  • చంద్రబాబు, పవన్ వి దిగజారుడు రాజకీయాలు
  • ఇప్పటి వరకూ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు చెప్పండి చూద్దాం
  • ఆ పేర్లను వాళ్లు చెబితే రాజకీయాల నుంచి వైదొలుగుతా

ఏపీ సీఎం వైఎస్ జగన్ పైనా, ఆయన పరిపాలనా తీరుపైనా విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ వి దిగజారుడు రాజకీయాలని విమర్శించారు. చంద్రబాబుకు తొత్తుగా పవన్ వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని దుమ్మెత్తిపోశారు. ఏపీలో పాలనపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, పవన్ లు.. ఆరునెలల్లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే కనుక తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు.

Chandrababu
Pawan Kalyan
jagan
srikanthreddy
  • Loading...

More Telugu News