Polavaram: పోలవరం నిర్వాసితులతో సీపీఐ నారాయణ సమావేశం

  • సమస్యలు అడిగి తెలుసుకున్న నారాయణ
  • గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్
  • డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపు

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సీపీఐ నేత నారాయణ భేటీ అయ్యారు. వారిని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలాన్ని యూనిట్ గా తీసుకుని భూసేకరణ చేయాలని అన్నారు. గతంలో ఎకరాకు రూ.1.15 లక్షలు పొందిన రైతులకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. పోడు రైతులకు కూడా ప్యాకేజి వర్తింపచేయాలని సూచించారు. అంతేకాకుండా, 18 ఏళ్లు నిండిన యువ రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి వర్తింపచేయాలని అన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వాసితులంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Polavaram
CPI Narayana
CPI
Andhra Pradesh
West Godavari District
  • Loading...

More Telugu News