Ramajogayya Sastri: నాకు బాగా పేరు తెచ్చిన పాట అదే: గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి

  • తెలుగులో 'యువసేన'కి మొదటి పాట రాశాను 
  • ఇంతవరకూ 1200 పాటలకి పైగా రాశాను 
  • ఆ పాట రాసే ఛాన్స్ దొరకడం తన అదృష్టమన్న శాస్త్రి

తెలుగు గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి కూడా చెప్పుకోదగిన పాటలు రాశారు. అన్నిరకాల పాటలను రాయగలరు అనే గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "తెలుగులో మొదటిసారిగా నేను 'యువసేన' అనే సినిమాతో పాటల రచయితగా పరిచయమయ్యాను. ఆ సినిమాలో రెండు పాటలు రాసే అవకాశం నాకు దక్కింది.

ఇంతవరకూ 1200 పాటలకుపైగా రాయగలిగాను. వీటన్నింటిలోను 'ఖలేజా' సినిమాలోని 'సదాశివా సన్యాసి .. తాపసి .. కైలాసవాసి' అనే పాట నాకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది. నేను రాసిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట అదే. నిజానికి ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి స్థాయివాళ్లు రాయవలసిన పాట. అలాంటి పాటను రాసే అవకాశం నాకు కలగడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

Ramajogayya Sastri
Ali
  • Loading...

More Telugu News