Sania Mirza: గర్భవతిగా ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదురయ్యాయి: సానియా ఆవేదన

  • శరీరాకృతిపై అవమానకరంగా కామెంట్లు చేస్తారు
  • ఒక మహిళ కాస్త బరువు పెరిగినా.. గర్భవతా? అంటారు
  • ఇకపై వారి నోర్లు మూయించాలని నిర్ణయించుకున్నా

తాను గర్భవతిగా ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదురయ్యాయని టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తోన్న కామెంట్ల గురించి ఆమె స్పందించింది. సోషల్ మీడియాలో వ్యక్తి శరీరాకృతిపై అవమానకరంగా కామెంట్లు చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక మహిళ కాస్త బరువు పెరిగినా, వెంటనే మీరు గర్భవతా? అని అడుగుతారని ఆవేదన వ్యక్తం చేసింది.

సెలబ్రిటీలుగా తాము సౌకర్యవంతంగా ఉండాల్సి ఉంటుందని, తాను గతంలో గర్భవతిగా ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశానని, దాని వల్ల కూడా తనకు అవమానాలు ఎదురయ్యాయని సానియా తెలిపారు. ఇకపై తాను వారి నోర్లు మూయించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కాగా, ఆమె కొన్ని నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజన్లు పదే పదే కామెంట్లు చేస్తుంటారు.

Sania Mirza
tennis
sports
Twitter
  • Loading...

More Telugu News