cm: విధ్వంసానికి, వికృతచర్యలకు కేరాఫ్ అడ్రస్ జగన్ పాలన: టీడీపీ నేత కళా వెంకట్రావు

  • ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాసిన కళా వెంకట్రావు
  • సొంత సామాజిక వర్గానికే జగన్ ప్రాధాన్యత
  • జగన్ తీరుతో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి  

ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలనపై ఏపీ టీడీపీ నేత కళావెంకట్రావు నిప్పులు చెరిగారు. ఈ మేరకు ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. విధ్వంసానికి, వికృతచర్యలకు జగన్ పాలన కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. సొంత సామాజిక వర్గానికే జగన్ ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. జగన్ తీరు కారణంగా రాష్ట్రంలోని రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయాయని, పోలవరంపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా రూ.7500 కోట్లు నష్టం చేశారని, సిమెంట్ కంపెనీల నుంచి రూ.2500 కోట్లు జే-టాక్స్ వసూలు చేశారని ఆరోపించారు.

cm
Jagan
Telugudesam
kala venkat rao
  • Loading...

More Telugu News