Chandrababu: మంత్రి బుగ్గనకు ఆర్థికశాఖ ఫండమెంటల్స్ తెలుసా?: చంద్రబాబు

  • కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • టీడీపీ శ్రేణులతో సమావేశం
  • వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి  ఏం తెలుసని ప్రశ్నించారు.  కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి బుగ్గనకు కనీసం ఆర్థికశాఖ ఫండమెంటల్స్ కూడా తెలియవని అన్నారు.

కోడిగుడ్ల కోసం బుగ్గన అనుచరులు కొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దోమలపై దండయాత్రను బుగ్గన అవహేళన చేశారని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని వారు కూడా తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు నిలిచిపోయి, పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయాయని విమర్శించారు. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదవాడి పొట్టకొట్టారని మండిపడ్డారు. 4, 5 విడతల రుణమాఫీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.

Chandrababu
Buggana
Andhra Pradesh
Telugudesam
YSRCP
Kurnool District
  • Loading...

More Telugu News