DK Aruna: ట్వీట్లు చేయడం కాదు... ప్రధాని మోదీతో కేటీఆర్ నేరుగా మాట్లాడాలి: డీకే అరుణ
- దిశ ఘటనపై స్పందించిన డీకే అరుణ
- అంతర్జాతీయ నగరంలో ఇలాంటి ఘటనలు దారుణమన్న బీజేపీ నేత
- నెలరోజుల్లోపే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్
సంచలనం సృష్టించిన దిశ ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. అంతర్జాతీయస్థాయి నగరంలో ఇటువంటి ఘటనలు జరగడం దారుణమని వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ ఇక్కడి నుంచి ట్వీట్లు చేయడం కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ మహిళా కార్మికులకే కాదు, మహిళా ఉద్యోగులందరికీ రాత్రివేళల్లో వెసులుబాటు కల్పించాలని సూచించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, కఠిన శిక్షలు పడేవరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కంటే వేగంగా నెలరోజుల్లోనే శిక్షలు పడేలా చూడాలని పేర్కొన్నారు.