Andhra Pradesh: శాసనసభ కమిటీలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి: ఏపీ స్పీకర్ తమ్మినేని

  • ప్రభుత్వ పథకాల అమలు తీరు పరిశీలించాలి
  • అమలులో లోపాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
  • అలా చేస్తే పాలనలో జవాబుదారీతనం వస్తుంది

శాసనసభ కమిటీలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలు తీరును కమిటీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, లోపాలు ఏమైనా వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే, పాలనలో జవాబుదారీతనం వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గొప్ప ప్రాధాన్యం ఇస్తోందని, ఆ ఫలితాలు వారికి అందేలా సలహాలు ఇవ్వాలని సూచించారు.

Andhra Pradesh
speaker
Tammineni sitaram
  • Loading...

More Telugu News