Jarkhand: చొరబాటుదారులను 2024 లోగా దేశం నుంచి బయటకు పంపిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- దేశమంతటా ఎన్ఆర్సీ అమలు చేస్తాం
- చొరబాట్లను అణచివేస్తాం
- చొరబాటుదారులపై రాహుల్ ప్రేమ విడ్డూరం
దేశమంతటా నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ను అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చొరబాట్లను అణచివేస్తామని, చొరబాటుదారులను గుర్తించి 2024 లోగా దేశం నుంచి వారిని బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆయన మండిపడ్డారు. చొరబాటుదారులపై రాహుల్ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. చొరబాటుదారులు ఎక్కడికి వెళ్తారు? ఏం తింటారు? అని రాహుల్ ప్రశ్నించడం దారుణమంటూ మండిపడ్డారు.