Disha: దిశ నిందితుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్... విచారణ రేపటికి వాయిదా

  • సంచలనం సృష్టించిన శంషాబాద్ ఘటన
  • ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న నిందితులు
  • 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు

సభ్య సమాజాన్ని నిశ్చేష్టకు గురిచేసేలా జరిగిన దిశ హత్యోదంతంపై సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవరిని కదిలించినా భగ్గుమంటున్నారు. తాజాగా ఈ ఘటనలో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత నిశితంగా విచారణ చేపట్టాల్సి ఉందని, నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

పిటిషన్ ను పరిశీలించిన షాద్ నగర్ కోర్టు  ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేని కారణంగా విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రస్తుతం నిందితులు ఉన్న చర్లపల్లి జైలు వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇతర ఖైదీలు వారిపై దాడి చేసి చంపేస్తారేమోనన్న అనుమానంతో, నిందితులకు ప్రత్యేకంగా హైసెక్యూరిటీ సింగిల్ బ్యారక్ కేటాయించిన సంగతి తెలిసిందే.

Disha
Telangana
Hyderabad
Police
Court
  • Loading...

More Telugu News