TTD: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై మండిపడ్డ చంద్రబాబునాయుడు

  • మీ చేతగానితనంతోనే అన్యమత ప్రచారం 
  • ఆర్టీసీ బస్సుల్లో ‘జెరూసలేం యాత్ర’ అని వేసుకున్నారు
  • నాకు సంబంధం లేదు 

తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ చంద్రబాబునాయుడు, ఆయనకు ’ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ వంత పాడుతున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్నూలు వేదికగా చంద్రబాబు స్పందించారు. ‘మీ చేతగానితనంతో ఆర్టీసీ బస్సుల్లో ‘జెరూసలేం యాత్ర’ అని మీరేసుకున్నారు.. నాకు సంబంధం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు.

ప్రకాశం జిల్లాలో మేరీమాత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘర్షణలు జరిగే పరిస్థితులు వచ్చాయని, అందుకు బాధ్యత వారిదేనని అన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చుకుని నిరుద్యోగులకు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కోట్ల రూపాయలు తమ కార్యకర్తలకు వైసీపీ దోచిపెడుతోందని, ఇది ఎవరిసొత్తో అడగాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.

TTD
chairman
yv subba reddy
Chandrababu
  • Loading...

More Telugu News