YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు.. వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలను విచారిస్తున్న పోలీసులు

  • పలువురు టీడీపీ నేతలను కూడా విచారిస్తున్న పోలీసులు
  • మార్చి 14న హత్యకు గురైన వివేకానందరెడ్డి
  • ఇప్పటికే పలువురికి నార్కో అనాలిసిస్ పరీక్షలు

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లోనే ఆయనను హతమార్చారు. ఈ హత్యపై అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగా పని చేయడం లేదనే భావనతో వైసీపీ ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురికి ఇప్పటికే నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా చేశారు. వీరిలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

YS Vivekananda Reddy
YS Bhaskar Reddy
YS Manohar Reddy
Murder
  • Loading...

More Telugu News