Saravana Stores: హీరోగా అలరించేందుకు వస్తున్న శరవణ స్టోర్స్ యజమాని

  • సొంత ప్రొడక్షన్ లో చిత్రం
  • ఇప్పటికే పలు యాడ్స్ లో నటించిన శరవణన్
  • జేడీ-జెర్రీ దర్శకత్వంలో చిత్రం

దక్షిణాదిన శరవణ స్టోర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా, శరవణ స్టోర్స్ యజమాని శరవణన్ గురించి పరిచయం అక్కర్లేదు. తన స్టోర్స్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో తానే నటిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి శరవణన్. తమన్నా, హన్సిక వంటి మిల్కీబ్యూటీల మధ్య చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతూ ఆయన నటించే యాడ్స్ వీక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. తాజాగా శరవణన్ దృష్టి సినీరంగంపై పడింది. ఆయన హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది. చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ లో ఆదివారం ఘనంగా ఓపెనింగ్ జరిగింది.

ది లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ చిత్రానికి జేడీ-జెర్రీ ద్వయం దర్శకత్వం వహిస్తోంది. ఇందులో శరవణన్ సరసన గీతికా తివారి హీరోయిన్. ఈ సినిమాలో ప్రభు, విజయ్ కుమార్, నాజర్, వివేక్ వంటి సీనియర్ తారాగణం నటిస్తోంది. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

Saravana Stores
Saravanan
Cinema
Hero
Tamilnadu
Chennai
  • Loading...

More Telugu News