Andhra Pradesh: ఏపీలో దున్నపోతు పాలన నడుస్తోంది: చంద్రబాబునాయుడు ఫైర్

  • ఇది విధ్వంసక ప్రభుత్వం
  • ప్రజాప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదు
  • రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలి

ఏపీలో అరాచకపాలన, దున్నపోతు పాలన నడుస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది విధ్వంసక ప్రభుత్వం తప్ప, ప్రజాప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదని విమర్శించారు. తమపై అక్రమంగా పెట్టిన కేసుల గురించి కచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. అనవసరంగా రెచ్చిపోయి తమపై కేసులు బనాయించొద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు.

తమ హయాంలో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లాలో ఒక తట్ట మట్టి తీశారా? ఒక యూనిట్ పని చేశారా? అని ప్రశ్నించారు. ఎప్పటికైనా సరే రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలని, దీని కోసం ప్రభుత్వం పని చేస్తే తాము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

Andhra Pradesh
cm
jagan
Chandrababu
kurnul
  • Loading...

More Telugu News