Fadnavis: నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు: ఫడ్నవీస్

  • రూ. 40 వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారంటూ ఫడ్నవీస్ పై ఆరోపణలు
  • ఎలాంటి నిధులను కేంద్రానికి పంపలేదన్న ఫడ్నవీస్
  • బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ మినహా మహా ప్రభుత్వం చేతిలో మరేమీ లేదని వ్యాఖ్య

దాదాపు రూ. 40 వేల కోట్లను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాపాడారని... శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే అభివృద్ధి పేరుతో వాటిని దుర్వినియోగం చేస్తారనే ఆలోచనతో వాటిని కేంద్రానికి తిప్పి పంపారంటూ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో  మహారాష్ట్రకు ఫడ్నవీస్ అన్యాయం చేశారంటూ శివసేన, ఎన్సీపీ మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై ఫడ్నవీస్ స్పందించారు.

ఇదంతా పూర్తి అసత్య ఆరోపణ అని ఫడ్నవీస్ అన్నారు. తన మూడు రోజుల పాలనలో ఎలాంటి నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదని ఆయన చెప్పారు. బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ చేయడం మినహా, మహారాష్ట్ర ప్రభుత్వం పాత్ర మరేమీ లేదని తెలిపారు. అసలు ఎటువంటి నిధులను పంపమని కేంద్ర ప్రభుత్వం తమను అడగడం కానీ, తాము పంపడం కానీ జరగనేలేదని చెప్పారు.

Fadnavis
BJP
Maharashtra
Anant Kumar Hegde
  • Loading...

More Telugu News