udaya bhanu: వెన్నులో వణుకు పుడుతోంది: దిశ ఘటనపై కన్నీటిపర్యంతమైన యాంకర్ ఉదయ భాను

  • చిన్న పిల్లలపై కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు
  • సోషల్ మీడియాలో కొందరు విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు
  • రాత్రి పూట తోపులాగ తిరిగే అమ్మాయిలకు ఇలాగే అవ్వాలంటున్నారు
  • ఇటువంటి వారిని తుపాకీతో కాల్చి పడేయాలి

హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటనపై ప్రముఖ యాంకర్ ఉదయ భాను స్పందించారు. ఈ ఘోర ఘటన జరిగినప్పటి నుంచి తన వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. టీవీ 9కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్న పిల్లలపై కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలను కూడా బడికి పంపుతున్నానని, చాలా భయపడుతున్నానని చెప్పారు.

దిశ ఘటనపై సోషల్ మీడియాలో కొందరు విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు చీడపురుగులాంటి వారని వ్యాఖ్యానించారు. రాత్రి పూట తోపులాగ ఒంటరిగా వెళ్లే అమ్మాయిలకు ఇలాగే అవ్వాలంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని తుపాకీతో కాల్చి పడేయాలని అన్నారు.

udaya bhanu
Disha
Crime News
  • Loading...

More Telugu News