TSRTC: ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు

  • కిలోమీటర్ కు 20 పైసల వంతున పెరగనున్న ఛార్జీలు
  • పెరిగిన ఛార్జీల పట్టికను నేడు విడుదల చేయనున్న అధికారులు
  • ఛార్జీల పెంపు వల్ల ఏడాదికి రూ. 750 కోట్ల అదనపు ఆదాయం

ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల వీపు విమానం మోత మోగనుంది. టీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి డిసెంబర్ 2వ తేదీ నుంచే ఛార్జీల పెంపు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ... టికెట్ యంత్రాల్లో మార్పులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉండటంతో... ఛార్జీల పెంపును అధికారులు ఒకరోజు వాయిదా వేశారు. పెరిగిన ఛార్జీల పట్టికను అధికారులు ఈరోజు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కిలోమీటర్ కు 20 పైసల వంతున ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపు వల్ల ఏడాదికి రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

TSRTC
Ticket Charges
  • Loading...

More Telugu News