Jagan: నా కళ్లు, చెవులు జిల్లా కలెక్టర్లే!: జగన్

  • ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి కలెక్టర్లే
  • కలెక్టర్లు నెలలో 15 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలి 
  • విమర్శలకు అవకాశం ఇవ్వకండి

జిల్లా కలెక్టర్లంతా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రతి నెలా కనీసం 15 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఉంటేనే వాస్తవాలు అర్థమవుతాయని అన్నారు. అబ్ధిదారుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా ముఖ్యమని చెప్పారు. రాత్రి పూట హాస్టల్స్, ఆస్పత్రులు, పల్లెల్లో నిద్ర చేయాలని ఆదేశించారు. కొందమంది జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లడం లేదనే సమాచారం తనకు వచ్చిందని... ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. పాలనలో కలెక్టర్లే తన కళ్లు, చెవులని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కలెక్టర్లే వారధిలాంటి వారని చెప్పారు. విమర్శలు చేసేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వరాదని అన్నారు.

  • Loading...

More Telugu News