Rakul Preet Singh: నేనేమీ హైదరాబాద్ లోని ఇల్లు అమ్ముకోలేదు: రకుల్ ప్రీత్ సింగ్

  • హైదరాబాద్ లో ఇంటిని అమ్మినట్టు వార్తలు
  • బెంగళూరులో కొత్త ఇల్లు కొన్నదని వదంతులు
  • తప్పుడు వార్తలంటూ ఖండించిన రకుల్ ప్రీత్

తాను హైదరాబాద్ లో ఇంటిని అమ్మేసి, బెంగళూరులో స్థిరపడేందుకు వెళ్లిపోతున్నట్టు వచ్చిన వార్తలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తన గురించి అసత్య వార్తలు రాస్తున్నారని, వాటిని వదిలిపెట్టి, వాస్తవాలను రాయాలని చెప్పింది. తానేమీ హైదరాబాద్ ను వదిలి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇంటిని కూడా అమ్మలేదని వెల్లడించింది.

 కాగా, హైదరాబాద్ లోని తన ఇంటిని విక్రయించిన రకుల్, బెంగళూరులో అందమైన భవంతిని కొనుగోలు చేసిందని ఇటీవల కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ రూమర్సేనని తాజాగా, స్పష్టం చేసిన రకుల్, కొంతమంది జర్నలిస్టులకు ఇటువంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడం లేదని వాపోయింది. తాను హైదరాబాద్ లో ఇంటిని కొన్నప్పుడు, ఎవరో బహుమతిగా ఇచ్చారని వార్తలు రాశారని, ఇప్పుడు ఇలా రాస్తున్నారని మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టును పెడుతూ, ఊహించి వార్తలు రాయడాన్ని ఇకనైనా ఆపివేయాలని సలహా ఇచ్చింది.

Rakul Preet Singh
House
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News