KCR: నేడు ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్.. మోదీతో భేటీ అయ్యే అవకాశం!

  • అమిత్ షా, రాజ్ నాథ్, గడ్కరీలతో భేటీ కానున్న కేసీఆర్
  • పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం
  • రేపు మోదీతో భేటీ అయ్యే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ప్రధాని మోదీతో రేపు ఆయన సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సమావేశాల సందర్భంగా... కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సెక్రటేరియట్ కు రక్షణ భూముల కేటాయింపు, విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన వాటితో పాటు వివిధ కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

KCR
TRS
Delhi
Narendra Modi
Amit Shah
Nitin Gadkari
BJP
  • Loading...

More Telugu News