Gayatri Travels: నడిరోడ్డుపై కాలి, బూడిదగా మిగిలిన గాయత్రీ ట్రావెల్స్ బస్సు!

  • హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతున్న బస్సు
  • చర్లపల్లి సమీపంలో ఇంజన్ లో మంటలు
  • తప్పిన పెను ప్రమాదం

నల్గొండ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (ఏపీ 36 ఎక్స్ 3654) మంటల్లో దగ్ధమైంది. గత రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు, నార్కట్‌పల్లి - అద్దంకి రహదారిపై ప్రయాణిస్తుండగా, చర్లపల్లి వద్ద ఇంజన్ లో మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులను దించేశాడు. ఆపై నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దగ్ధమైన బస్సును గుంటూరుకు చెందిన గాయత్రీ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Gayatri Travels
Hyderabad
Ongole
Fire Accident
  • Loading...

More Telugu News