vijayareddy: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసులో అటెండర్ మృతి

  • గత నెల 4న తహసీల్దార్ విజయారెడ్డి హత్య
  • చికిత్స పొందుతూ మృతి చెందిన నిందితుడు సురేశ్
  • గుండెపోటుతో ఈ ఉదయం కన్నుమూసిన అటెండర్

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో కాలిపోతున్న విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో అటెండర్ చంద్రయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.

గత నెల నాలుగో తేదీన భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం అడిగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న తహసీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ కార్యాలయంలోనే ఆమెపై పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయారెడ్డి ఘటనా స్థలంలోనే చనిపోగా, నిందితుడు సురేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా, అటెండర్ చంద్రయ్య గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

vijayareddy
MRO
Abudullapurmet
murder
  • Loading...

More Telugu News