Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ కొత్త అవతారం... చాన్స్ ఇచ్చిన కృష్ణవంశీ

  • రంగమార్తాండలో నటిస్తున్న రాహుల్
  • కృష్ణవంశీకి థ్యాంక్స్ చెప్పిన గాయకుడు
  • మీ దీవెనలు అవసరం అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు

బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటివరకు అందరికీ ఓ గాయకుడిగానే తెలుసు. కానీ రాహుల్ సిప్లిగంజ్ కు ఇప్పుడున్న ఫేమ్ అంతా ఇంతా కాదు. అంతా బిగ్ బాస్ మహిమ! మరి ఆ రియాల్టీ షో అందించిన పేరుప్రఖ్యాతులు రాహుల్ కు సినిమాలో నటించే చాన్స్ అందించాయి. అవును... త్వరలోనే ఈ టాలీవుడ్ సింగర్ నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నాడు. సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ అనే చిత్రంలో తాను కూడా నటిస్తున్నట్టు రాహుల్ వెల్లడించాడు.

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి గొప్పనటుల సరసన తాను నటిస్తుండడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని, ఈ అవకాశాన్ని తనకు ప్రసాదించిన దర్శకుడు కృష్ణవంశీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోషల్ మీడియాలో వివరించాడు. షూటింగ్ కోసం ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని, తానెంతో అదృష్టవంతుడ్నని భావిస్తున్నానని తెలిపాడు. మీ దీవెనలు కావాలంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.

మరాఠీలో హిట్టయిన నటసామ్రాట్ అనే క్లాసిక్ మూవీని కృష్ణవంశీ తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నారు. వయసైపోయిన ఓ నాటకరంగ కళాకారుడి దయనీయ జీవితాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం రొటీన్ కు భిన్నంగా ఇందులో మనసులు కదిలించే పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

Rahul Sipligunj
Tollywood
Rangamarthanda
Prakash Raj
Krishnavamsi
  • Error fetching data: Network response was not ok

More Telugu News