Disha: శంషాబాద్ ఘటనలో వెటర్నరీ వైద్యురాలి పేరు ‘దిశ’గా మార్పు: సీపీ సజ్జనార్

  • ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరు ప్రస్తావించకూడదు
  • సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది
  • పేరు మార్పుపై ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నామన్న సీపీ 

శంషాబాద్ వెటర్నరీ డాక్టరు హత్యాచారం ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కొందరు అంటుంటే, మరణ శిక్ష విధించాలని మరికొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా, ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరును, వారి కుటుంబసభ్యుల పేర్లను, వివరాలను ఎక్కడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె పేరును ‘దిశ’గా మారుస్తున్నట్టు సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ విషయమై ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్టు చెప్పారు. ఇకపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరును ‘దిశ’ అని పేర్కొనాలని, ‘జస్టిస్ ఫర్ దిశ’కు అందరూ సహకరించాలని కోరారు.

Disha
cp sajjanar
Justice for Disha
  • Loading...

More Telugu News