Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ‘రూలర్’.. ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ సాంగ్ విడుదల

  • లిరికల్ సాంగ్ విడుదల చేసిన చిత్రయూనిట్
  • ‘కింగ్ ఆఫ్ ది జంగిల్ లా..’ అంటూ కొనసాగిన పాట
  • ఈ నెల 20 న విడుదల కానున్న ‘రూలర్’

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ విడుదలైంది. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి రచించిన ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘కింగ్ ఆఫ్ ది జంగిల్ లా.. యాంగ్రీ అవెంజర్ లా ..రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లా వచ్చాడురా.. మండే సూర్యుడు.. వీడు మండే సూర్యుడు’ అంటూ కొనసాగే ఈ లిరిక్ లో బాలకృష్ణ లుక్ అదిరింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ‘రూలర్’ ఈ నెల 20 న విడుదల కానుంది. ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్న బాలకృష్ణ సరసన  కథానాయికలుగా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు.

Nandamuri Balakrishna
Ruler
KS Ravi kumar
Movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News