Anantapur District: ఏం కష్టం వచ్చిందో... రైలుకింద పడి తల్లీ, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య

  • అనంతపురం జిల్లాలో ఘటన
  • మరాఠీ కొట్టాల వద్ద రైలు కింద పడిన బాధితులు
  • అక్కడికక్కడే దుర్మరణం

ఏం కష్టం వచ్చిందో...ఎందుకంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో...ఓ తల్లి తన ఇద్దరు కూతుర్లతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా కేంద్రం శివారులోని మరాఠీ కొట్టాల వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

పాపం పేటకు చెందిన పోలేరమ్మకు దీప్తి, ఆర్తి ఇద్దరు కుమార్తెలు. ఈ రోజు ఉదయం ఇద్దరు కుమార్తెలను తీసుకుని మరాఠీ కొట్టాల వద్ద సంచరిస్తున్న పోలేరమ్మను స్థానికులు కొందరు గమనించారు. ఇంతలో ఓ రైలు వస్తుండగా కుమార్తెలతోపాటు తను కూడా రైలు ఎదురుగా వెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Anantapur District
Crime News
mother and daughters suicide
  • Loading...

More Telugu News