Priyaanka Reddy: ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్న వెటర్నరీ వైద్యురాలి కుటుంబీకులు!

  • పరామర్శలతో విసుగెత్తి పోయాం
  • రాజకీయ నాయకులు, మీడియా రావద్దు
  • పోలీసులకూ ప్రవేశం లేదని బోర్డు

గత రెండు రోజులుగా తమపై వెల్లువెత్తుతున్న పరామర్శలతో వెటర్నరీ డాక్టర్ కుటుంబీకులు విసుగెత్తిపోయారు. ఈ ఉదయం తమ ఇంట్లోకి రాజకీయ నాయకులతో పాటు మీడియా, పోలీసులు, బయటి వ్యక్తులు రావద్దంటూ, ఓ బోర్డును తగిలించి, ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్నారు. తమ బిడ్డను ఎవరూ తిరిగి తీసుకు రాలేరని, తమకు న్యాయం కావాలని, పరామర్శలు వద్దని వారు చెబుతున్న పరిస్థితి.

తమ ఆవేదనను అర్థం చేసుకోకుండా, వచ్చి విసిగిస్తున్నారని ఆమె కుటుంబీకులు వాపోయారు. తమ బిడ్డకు ఇంత అన్యాయం జరిగినా, ఎవరిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. తాము ఫిర్యాదు చేసిన సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండకపోతే, నేడు తమ బిడ్డ ఇంట్లోనే ఉండి వుండేదని అంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News