germany: నిందితుల ఆచూకీ తెలిపితే రూ.4 కోట్ల నజరానా: ప్రకటించిన బెర్లిన్ పోలీసులు
- జర్మనీలోని డ్రెస్డెన్ మ్యూజియంలో భారీ దోపిడీ
- కిటికీ అద్దాలు పగలగొట్టి చోరీ
- చోరీకి గురైన నగలను డబ్బులతో కొలవలేమంటున్న అధికారులు
ఓ మ్యూజియంలో నగలు దొంగతనం చేసిన వారి ఆచూకీ తెలిపిన వారికి రూ.4 కోట్లు ఇస్తామంటూ బెర్లిన్ పోలీసులు భారీ ఆఫర్ ప్రకటించారు. జర్మనీలోని డెస్డెన్ మ్యూజియంలో ఇటీవల భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన నగలను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
చోరీకి గురైన నగలను డబ్బులతో కొలవడం సాధ్యం కాదని, అవి చాలా విలువైనవని ప్రభుత్వం చెబుతోంది. నిందితులను పట్టుకుని తిరిగి స్వాధీనం చేసుకోకుంటే అవి ఎప్పటికీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు.. నిందితులను పట్టించిన వారికి నాలుగు కోట్ల రూపాయల నజరానా ప్రకటించారు.