Asish Goud: నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ పై 'బిగ్ బాస్-2' కంటెస్టెంట్ సంజన ఫిర్యాదు!

  • హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో ఘటన
  • మద్యం బాటిళ్లతో దాడికి యత్నం
  • బౌన్సర్లు, యాజమాన్యం పట్టించుకోలేదని ఫిర్యాదు

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ తనను వేధించాడంటూ బిగ్ బాస్ రెండో సీజన్ పోటీదారు సంజన మాదాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని, భవంతిపై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.

హైదరాబాద్, హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో శనివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడివున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, వేదింపులతో భయభ్రాంతులకు గురై, తప్పించుకున్నామని తెలిపింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తే నిజం తెలుస్తుందని వెల్లడించింది.

ఆశీష్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని, చుట్టూ పలువురు చూస్తున్నా అతన్ని ఎవరూ వారించలేదని ఆరోపించిన ఆమె, బౌన్సర్ల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, వారు కూడా ఆశీష్ ను పట్టించుకోలేదని తెలిపింది. హోటల్ యాజమాన్యం కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని, నోవాటెల్ హోటల్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని యువతులకు వారు హామీ ఇచ్చారు.

Asish Goud
Nandishwar Goud
Novotel
Hyderabad
Harrasment
Police
Case
  • Loading...

More Telugu News