Disha: నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు... వెటర్నరీ వైద్యురాలి ఘటనపై చిరంజీవి వ్యాఖ్యలు

  • సంచలనం సృష్టించిన శంషాబాద్ ఘటన
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన చిరంజీవి
  • కఠిన శిక్షలు విధించాలని విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం సంచలనం సృష్టించిన శంషాబాద్ ఘటనపై అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. గత రెండుమూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల గురించి వింటుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది? ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదా అనిపిస్తోందంటూ భావోద్వేగాలకు లోనయ్యారు.

"మనసు కలిచివేసిన ఈ సంఘటన గురించి ఓ అన్నగా, ఓ తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. మరెవరైనా నేరం చేయాలంటే భయం కలిగించేలా ఆ శిక్షలు ఉండాలి. దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు. ఈ వ్యవహారంలో పోలీసులు సత్వరమే దర్యాప్తు జరిపి నేరస్తులను పట్టుకోవడం అభినందనీయం. వారికి త్వరగా శిక్ష పడేలా చూడడం  కూడా ఎంతో ముఖ్యం.

ఆడపిల్లలందరికీ నేను చెప్పేదొక్కటే... మీ ఫోన్లలో 100 నంబర్ ను స్టోర్ చేసుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోన్లలో హాక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ వెంటనే స్పందిస్తాయి. పోలీసు విభాగం సేవలను, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత" అంటూ చిరంజీవి ఓ వీడియోలో తన సందేశం వినిపించారు.

  • Loading...

More Telugu News